ఈ నెల 25న దుబ్బాకలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభిస్తాం

ఈ నెల 25న దుబ్బాకలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభిస్తాం

ఎవరొచ్చినా రాకున్నా ఈ నెల 25న  దుబ్బాకలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ నెల చివరి వరకు ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. దుబ్బాకలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఇల్లు లేని నిరుపేదలను డ్రా పద్దతిలో ఎంపిక చేసి నేటికి 100 రోజులు గడుస్తున్నా పంపిణీ ప్రక్రియ పూర్తి కాకపోవడం పట్ల రఘునందరావు మండిపడ్డారు. పేదల ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఏ అతిథి హాజరైన, కాకున్నా గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దన్నారు. ఈ నెలలోనే  లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభానికి మంత్రి హరీష్ రావు,  కలెక్టర్ ను ఆహ్వానిస్తామన్నారు. ఆహ్వానించిన తర్వాత రావడం రాకపోవడం వారి ఇష్టమని చెప్పారు. పేదలకు ఇళ్లు అందించాలనే ధృడనిశ్చయం  ఉంటే  వారే వస్తారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడం ఏంటని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఇల్లు లేని నిరుపేదలు పట్టణంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారుల నిర్లక్ష్యం మూలంగా పేద ప్రజలు ఇబ్బందులకు గురి కావడం సరికాదని.. వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

 

దుబ్బాక మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు పూర్తి అయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పోవడంతో...

Posted by Raghunandan Rao Madhavaneni on Thursday, June 9, 2022