స్మితా సబర్వాల్ కు మళ్లీ రఘునందన్ రావు కౌంటర్

స్మితా సబర్వాల్ కు మళ్లీ రఘునందన్ రావు కౌంటర్

దేశంలో ఏ ఘటన జరిగినా ట్విట్టర్ లో ప్రశ్నించే సీఎంవో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు హైదరాబాద్ లో ఓ మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులు  కేవలం కింద స్థాయి పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు.  రాచకొండ కమిషనర్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి భాద్యులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కర్మన్ ఘట్ జీవన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని బీజేపీ నేతలతో  కలిసి పరామర్శించారు రఘునందన్ రావు.  బాధిత మహిళ కుటుంబానికి  బీజేపీ అండగా ఉంటుందని, న్యాయ సహాయం, ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. దేశంలో నంబర్ వన్ పోలీసింగ్ అని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో రక్షక వ్యవస్థ  విఫలమైందనే దానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. 

ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ తాజా, మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్  ఆత్మహత్యాయత్నంపై  స్మితా సబర్వాల్ ను ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో  జరిగే ఘటనలపై  స్పందించే స్మితా సబర్వాల్, మహిళా కమిషనర్ సునీతా రెడ్డి రాష్ట్రంలో మహిళలపై జరిగే దాడులపై  స్పందించాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు