కేంద్ర నిధుల‌తో దుబ్బాక అభివృద్ధి చేస్తాన‌ని నేను చెప్ప‌లేదు

కేంద్ర నిధుల‌తో దుబ్బాక అభివృద్ధి చేస్తాన‌ని నేను చెప్ప‌లేదు

కేంద్రం నుంచి నిధులు తెచ్చి దుబ్బాక అభివృద్ది చేస్తానని తాను చెప్ప‌లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాక గెలుపు కార్యకర్తలలో స్ఫూర్తి నింపింద‌ని, కేసీఆర్ సొంత ఇలాఖా లోనే టీఆర్ఎస్ ను ఒడించామన్నారు. జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల్లో కూడా అదే స్పూర్తితో పని చేస్తామ‌న్నారు. జీహెచ్ఎమ్‌సీ ఎలక్షన్ల‌ ఫలితం తో కేటీఆర్ కండ్లు కిందికి దిగి రావాలన్నారు.

రఘునందన్ కు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏమీ లేద‌ని, తాను వేరు బీజేపీ వేరు కాద‌ని అన్నారు. టీఆర్ఎస్ బ‌ల‌హీనప‌డింద‌ని, దుబ్బాక‌లో వాళ్ల‌ని 62 వేల మెజారిటీ తగ్గించి ఓడించామ‌ని చెప్పారు. వయస్సు , ఓపిక వున్నన్ని రోజులూ.. ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీలోనే కొనసాగుతాన‌ని.. పార్టీ మారుతాన‌నే ప్రశ్న వుత్పన్నం కాదని అన్నారు. టీఆర్ఎస్ లో అవమానాల పాలు అవుతున్న ఉద్యమ కారులు వస్తే మేము అక్కున చేర్చుకుటం..

టీఆర్ఎస్ నేత‌లు ఓల్డ్ సిటీ ని పాత బస్తీ కి రాసిచ్చారని, ఎంఐఎం కు మేయర్ పదవి క‌ట్టబెట్టెందుకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశార‌న్నారు. ఓల్డ్ సిటీ నుంచి ఎలాంటి ట్యాక్స్‌లు రావ‌ని, జ‌నం కట్టే డబ్బుల తోనే ఓల్డ్ సిటీ లో ఖర్చు చేస్తున్నారన్నారు. రానున్న జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ఓటు వేస్తే పచ్చ జెండాకు వేసినట్లేన‌ని, భాగ్యనగరం రూపు రేఖలు మారాలంటే బీజేపీతోనే సాధ్యమని అ‌న్నారు.