ఆర్జీవీపై బీజేపీ కేసు

ఆర్జీవీపై బీజేపీ కేసు

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఓ వేస్ట్ ఫెలో  అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు . ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న  ద్రౌపతి ముర్ముపై  రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ చేశారు. ద్రౌపది ప్రెసిడెంట్ అయితే మరి పాండవులు, కౌరవులు ఎవరు అంటూ వర్మ చేసిన ట్వీట్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.  ఆదివాసీ మహిళను కించపరిచేలా కామెంట్ చేసిన వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వార్తల్లో నిలిచేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తారని మండిపడ్డారు. ఆదివాసీ మహిళపై ఇలాంటి ట్వీట్ బాధకరమన్నారు రాజాసింగ్. రామ్ గోపాల్ వర్మ మైండ్ పనిచేయడం లేదని  బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి విమర్శించారు. కాబోయే రాష్ట్రపతిపై వర్మ అసభ్యకరంగా ట్వీట్ చేయడం సరైంది కాదన్నారు. కాగా.. అబిడ్స్ పోలీసులకు వర్మపై బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ ఫిర్యాదు చేశారు.