
టీఆర్ఎస్ ,ఎంఐఎం లకు ధన బలముంటే బీజేపీకి కార్యకర్తల బలముందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్ తన ప్రసంగంతో పార్టీ కార్యకర్తల్లో నూతనుత్తేజాన్ని నింపారు. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడితే బెదిరిపోయేది కాంగ్రెస్సే కానీ బీజేపీ కార్యకర్తలు కాదని ప్రశంసల వర్షం కురిపించారు.
మేయర్ ని గెలిపిస్తే నిజామాబాద్ ను ఇందూరుగా మారుస్తాం
39 మున్సిపల్ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించి మేయర్ ని చేయాలని రాజాసింగ్ ఓటర్లను కోరారు. బీజేపీ అభ్యర్ధి మేయర్ అయితే నిజామాబాద్ ను ఇందూరుగా మారుస్తామని హామీ ఇచ్చారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంవత్సరం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, కర్ణాటకాలను నిజాం పాలకులు పాలించారని, స్వాతంత్ర్యం రాకముందు నిజామాబాద్ పేరు ఇందూరుగా ఉండేదని రాజాసింగ్ గుర్తు చేశారు. నిజాం పాలకులు ఇందూరును కాస్తా నిజామాబాద్ గా మార్చారని అన్నారు. అంతేకాదు భర్తల్ని హతమార్చి భార్యల్ని వివస్త్రల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించారని అన్నారు. అందుకే నిజాం పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే నిజామాబాద్ ను ఇందూరుగా మారుస్తామని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ ని చూస్తే బామ్మర్ది మా అసదుద్దీన్ కి భయమేస్తుంది
బీజేపీ కార్యకర్తల్ని చూస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కాదు దేశం మొత్తం భయపడుతుందని రాజాసింగ్ అన్నారు. జనగణమణ, జాతీయ జెండా కూడా పట్టని మా బామ్మర్ది అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు మోడీ, అమిత్ షా దెబ్బతో భయపడుతున్నారని అన్నారు. దారుసలేంలో అందరూ జాతీయ జెండాలతో మేం భారతీయులమని చెప్పుకుంటున్నారు. ఇన్నిరోజులు గుర్తుకు రాలేదా తాము భారతీయులమని ప్రశ్నించారు. చట్టం తెచ్చారు కాబట్టి ప్రతీ ఒక్కరు జాతీయ జెండా ఎగురవేస్తూ మేం భారతీయులం అని చెప్పుకొని తిరుగుతున్నారని రాజాసింగ్ అన్నారు.
దారుసలేంలో అసదుద్దీన్ తన బామ్మర్ధి అని ప్రూవ్ చేశారని రాజాసింగ్ అన్నారు. ఆయన నోటితోనే తనని కొంతమంది నా బామ్మర్ధి అని అంటున్నారని, అవును వాళ్లకు నేను బామ్మర్దినే అవుతానని ఓవైసీ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుర్తు చేశారు.
మరిన్ని వార్తలు..