బంజారాహిల్స్ పీఎస్ లో ఎమ్మెల్సీ కవిత పై ఫిర్యాదు

బంజారాహిల్స్ పీఎస్ లో ఎమ్మెల్సీ కవిత పై ఫిర్యాదు

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో.. వెంటపడి తంతం కొట్టి కొట్టి చంపుతామంటూ వ్యాఖ్యలు చేసిన కవిత.. ఆ వెంటనే 50 మంది టీఆర్ఎస్ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని అరవింద్ ఫిర్యాదులో తెలిపారు. ఆ 50 మంది టీఆర్ఎస్ నాయకులను ఉసిగొల్పి ఇంటిపై దాడికి పంపించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి ఘటనలో కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాగా, కాంగ్రెస్ లో చేరేందుకు ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారన్న ఎంపీ అర్వింద్ కామెంట్స్ తో.. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించారు. టీఆర్ఎస్ జెండా కర్రలతో ఇంటి అద్దాలు, పూలకుండీలను పగులగొట్టారు. ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. పెద్దఎత్తున తరలివచ్చిన గులాబీ కార్యకర్తలు ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా నిదాలు చేశారు.

సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఎంపీ అర్వింద్ అన్నారు. ఇంట్లోని వస్తువులు పగుల గొడుతూ.. బీభత్సం సృష్టిస్తూ తన అమ్మను బెదిరించారంటూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వస్తువుల ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు.