ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా అప్పులు చేయాల్సి వస్తుంది. కాని శాస్త్రాల ప్రకారం అప్పు ఇచ్చేందుకు .. తీసుకొనేందుకు కొన్ని నియమాలున్నాయని పండితులు చెబుతున్నారు. పండితులు తెలిపిన మంగళవారం.. శుక్రవారం ఈ రెండు రోజుల్లో డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకూడదని.. తీసుకోకూడదని చెబుతుంటారు. ఆ రెండు రోజుల్లో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు....? కారణం ఏమిటి...? మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
శాస్త్రాల ప్రకారం మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. అందుకే మంగళవారం శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఆ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.
ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు .
మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై ఎందుకోసం తీసుకున్నామో ఆ పనులు సగంలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. అప్పుగా తీసుకున్న డబ్బులు వృథా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
అలాగే శుక్రవారం కూడా ఎవరికీ డబ్బు ఇవ్వరు. కొందరు ఆరెండు రోజులు బూజులు కూడా దులపరు. పుట్టింటినుంచి ఆడపిల్లను అత్తవారింటికి పంపరు. ఎందుకంటే ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు.
మంగళవారం.. శుక్రవారం ఆ రెండు రోజులు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా ఉంది. ఆడపిల్లను ఇంటినుంచి బయటకు పంపితే.. లక్ష్మీదేవిని పంపినట్టేనని హిందువులు భావిస్తారు. ఆడపిల్ల తల్లి గారి ఇంటి నుంచి అత్తగారింటికి ఎప్పుడు వెళ్లినా.. పసుపు.. కుంకుమతో పంపుతారు.
మంగళవారం.. శుక్రవారం బూజులు దులిపితే తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకం ఉంది. దీనికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. శ్రీ కాళహస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలె పురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి .. శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది. బూజులు, అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు.. వాటిని తీసి ఆ శ్రీలక్ష్మీకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు.
►ALSO READ | Summer Health : ఎండలు ముదురుతున్నాయి... స్కిన్ అలెర్జీ వస్తుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ, శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా..? చెడ్డదా..? అన్న విషయానికొస్తే సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు.
కనీసం ఆ రెండు రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నమే..అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరుకి గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయ్యటం వల్ల మరింత ధనం పోతుంది.
పండితులు తెలిపిప వివరాల ప్రకారం.. మంగళవారం.. శుక్రవారం ఆ రెండు రోజులకు మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట. అందుకే బ్యాక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా ? మంగళవారం నాడు చెయ్యండి. ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటుందని పండితులు చెబుతున్నారు.
అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారే వారు మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో అప్పులు తీరుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
