భానుడు భగ భగ మండిపోతున్నాడు. మద్యాహ్నం అయిందంటే జనాలు రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. . మొన్నటి వరకు చలికి వణికిపోయిన జనాలు ఇప్పుడు ఎండతో ఇబ్బంది. పడుతున్నారు. అయితే ఎండలతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది వేసవి, ఆస్తమా, ఊపిరితిత్తులు, చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
శోభి మచ్చలు: టినియా వచ్చికలర్ (శోభి మచ్చలు) ఉన్న వాళ్లకు వేసవిలో ఈ సమస్య మరింత పెరు గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఫంగస్ విజృంభిస్తుంది. దాంతో మచ్చలు మరింత పెద్దగా అయ్యే ప్రమాదం ఉంది. చెమట ఎక్కువగా వస్తుంది. మచ్చలు ఉన్న చోట మంట వస్తుంది. శుభ్రత పాటించడం ద్వారా. దీని నుంచి ఉపశమనం పొందవచ్చు
చర్మవ్యాధులు: వేడి నుంచి శరీరాన్ని రక్షించడానికి అధికంగా చెమట విడుదల కావడం సూర్యరశ్మిలోని అతినీలలోహిత (యూవీ) కిరణాల వల్ల చర్మకణాలు దెబ్బతినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. చెమట వల్ల చర్మంపై తేమ ఎక్కువగా ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా, ఫంగస్ విజృంభిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక యూవీ కిరణాల వల్ల చర్మ కణాల్లోని డీఎన్ఏ దెబ్బ తింటుంది. దాంతో వాపు వస్తుంది, చర్మ వ్యాధులకు దారితీస్తుంది.
►ALSO READ | Moral Story: షాపు యజమాని పిల్లాడిని మోసం చేశాడు.. ఆ తరువాత ఏం జరిగందంటే..!
ఆస్తమా : ఆస్తమా ఉన్నవాళ్లు ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేసవిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. ఎండ పెరగడంతో గాలి వేడెక్కుతుంది. వేడి గాలి ఆవిరి రూపంలో ఎక్కువనీటిని నిల్వ చేసుకుంటుంది. గాలిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల సూక్ష్మజీవులు పెరిగే ప్రమాదం ఉంటుంది. గాలిలో చేరే కాలుష్య కారకాలు కూడా ఎక్కువగా విస్తరిస్తాయి. ఆస్తమా ఉన్నవాళ్లు గాలి పీలిస్తే సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాళ్లు బయటకి వెళ్లేటప్పుడు మెడిసిన్స్. తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది, ఉదయం, సాయంత్రాల్లోనే పనులు చేసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు వెంట తీసుకెళ్లాలి.
- ఒకేసారి ఎక్కువగా తినకుండా ఎక్కువ సార్లు కొద్ది కొద్దిగా తినాలి.
- తేలికైన, వదులుగా ఉన్న, లేత రంగుల దుస్తులు వేసుకోవాలి
- ఆల్కహాల్, కాపీ, టీల వంటివి డీహైడ్రేష్ నీకు కారణమవుతాయి. వాటిని వీలైనంత తక్కువగా తీసుకుంటే మంచిది.
- ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి.
- పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు తాగడం మంచిది
- రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.
- చల్లగా ఉన్ననీళ్లు, డ్రింక్స్ తాగకూడదు. అలాగే బాగా వేడిగా ఉన్న వాటిని కూడా తాగకూడదు
–వెలుగు,లైఫ్–
