రాజకీయాల్లో న్యూ బ్రీడ్ని.. కానీ హైబ్రీడ్ను : అర్వింద్

రాజకీయాల్లో న్యూ బ్రీడ్ని.. కానీ హైబ్రీడ్ను : అర్వింద్

తాను రాజకీయాల్లో న్యూ బ్రీడ్ ను కానీ.. హైబ్రీడ్ ను అని అన్నారు ఎంపీ అర్వింద్. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి నామినేషన్ కార్యక్రమంలో అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  జగిత్యాలలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. భోగ శ్రావణిని గెలిపిస్తానని మాటిచ్చానన్నారు. జీవన్ రెడ్డి రాజకీయ అనుభవంతం తన వయసు లేదు కానీ.. హై బ్రీడ్ నన్నారు. 

కొండా లక్ష్మణ్,  మాణిక్ రావు, జగన్నాథ్ రావు , డి. శ్రీనివాస్ ను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు అర్వింద్ .  75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ అభ్యర్థి అయినా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు.  2004లో డీఎస్ ను మోసం చేసి ..ఆయన రాజకీయ జీవితం నాశనం చేసింది సోనియా గాంధీనేనన్నారు. డీఎస్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవాలంటే.. రాహుల్ ,ప్రియాంక ఇంటికి వచ్చి కండువా కప్పేది ఉండే అన్నారు. 

కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదు..370 ఆర్టికల్ పెడతారా?  తిప్పితిప్పికొడితే కాంగ్రెస్ కు 30 సీట్లు రావన్నారు అర్వింద్. తెలంగాణ చరిత్ర  మార్చేది మహిళలేనని చెప్పారు.  మోదీ నాయకత్వం రావాలంటే మహిళలు అండగా ఉండాలన్నారు.  తినే తిండి నుంచి రుణాల వరకు మోదీ ఇచ్చినవేనని.. కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ వస్తే గొర్లు  మింగేటోడు పోయి బర్లు మింగేటోడు వస్తారని విమర్శించారు. 

జగిత్యాల నుంచి బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్, బీజేపీ నుంచి భోగ శ్రావణి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు