కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు

కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు

కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని సెటైర్ వేశారు. ఎవరినీ సస్పెండ్ చేయాలో...ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసన్నారు. కవితకు ఇప్పటికైనా హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషమన్న ఎంపీ ఆమెకు హిందుత్వం గుర్తు చేసిందే బిజేపీ అని చెప్పారు. తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్తారని అర్వింద్ ప్రశ్నించారు.

కేంద్రం ఇస్తోన్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడని ఆరోపించారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 2లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏంచేశారో  సీఎం కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గ్రూప్ వన్ పరీక్షలో ఉర్థూ భాషను ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు, పెన్షన్లు ఇవ్వటం సిగ్గుచేటన్నారు. నాలుగైదు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటకీ.. టెక్ట్స్ బుక్స్ కోసం టెండర్లకు పిలవకపోవటం దారుణమని మండిపడ్డారు. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం తెలంగాణలో అటకెక్కాయని అర్వింద్ విమర్శించారు.