టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్ రాజీనామా చేయాలి

V6 Velugu Posted on Dec 07, 2021

ఉప్పుడు బియ్యం, రా రైస్ అంటే టీఆర్ఎస్ ఎంపీలకు తెలియదన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. కొనుగోలు కేంద్రాలకు టీఆర్ఎస్ నేతలు ఎందుకు వెళ్ళడం లేదన్నారు.  తరుగుల పేరుతో రైతులను నిండా ముంచుతున్నారు. ఒక్క తరుగుతోనే కొనుగోలు కేంద్రాల వద్ద 4 కేజీల తరుగు తీస్తున్నారన్నారు.  రైస్ మిల్లర్లు, కేసీఆర్, కేటీఆర్ జేబులు నింపుకుంటున్నారన్నారు. మక్క, వరి రైతులను నిండా ముంచుతున్నారన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఎందుకు లేటవుతున్నాయన్నారు. టీఆర్ఎస్ నేతలు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి తరుగు లేకుండా చూడాలన్నారు.

రైతాంగాన్ని నాశనం చేసిన  ఘనత కేసీఆర్ దేనన్నారు. రైతులను ముంచి రైతుల కోసం రాజీనామా చేస్తానంటారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలకు కనీసం బియ్యంపై అవగాహన లేదన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్ర సర్కారే లెటర్ ఇచ్చిందన్నారు. కొనుగోళ్లపై తెలంగాణలోనే ఎందుకు కిరికిరన్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో టీ ,కాఫీలు తాగి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారన్నారు.
 

Tagged KTR, BJP MP Arvind, TRS MPs, salt rice, raw rice

Latest Videos

Subscribe Now

More News