వ్యక్తి శక్తిగా మారితే శ్యాంప్రసాద్‌ ముఖర్జీలా ఉంటది

వ్యక్తి శక్తిగా మారితే శ్యాంప్రసాద్‌ ముఖర్జీలా ఉంటది

హైదరాబాద్: వ్యక్తి శక్తిగా మారితే ఎలా ఉంటుందో భారతీయ జన్ సంఘ్ స్థాపకుడు డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసి చూపించారని బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శ్యాం ప్రసాద్ స్ఫూర్తిగా దేశ యువత ముందుకు సాగుతున్నారని సంజయ్ చెప్పారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిరోజూ కొలిచే వ్యక్తి శ్యాంప్రసాద్ అని పేర్కొన్నారు. 

‘శ్యాంప్రసాద్ ముఖర్జీ అతిచిన్న వయస్సులో వీసీ అయ్యారు. ఆయన మంత్రిగా పని చేశారు. మైనారిటీ సంతుష్టీకరణతో హిందువులను రక్షణ లేకుండా ఉన్న రోజుల్లో ఆయన అడ్డుకున్నారు. వ్యక్తి శక్తిగా మారితే ఎలా ఉంటుందో చూపించారు. జన్‌సంఘ్ ఏర్పాటు చేసి మూడు పార్లమెంట్ స్థానాలు గెలిపించుకున్నారు. అనధికార ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని శ్యాంప్రసాద్ పార్లమెంట్‌లో గళమెత్తారు. ఒకే దేశంలో రెండు జెండాలు, వేర్వేరు రాజ్యాంగాలు ఉండకూడదని పోరాడారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌కు వెళ్తున్న క్రమంలో ఆయన ప్రాణత్యాగం చేశారు. శ్యాంప్రసాద్ దేని కోసమైతే బలిదానం చేశారో అదే ఆశయసాధన కోసం 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసింది’ అని బండి సంజయ్ చెప్పారు.