కాంగ్రెస్ అసమర్థ సర్కార్ .. సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి యాక్టివ్‌‌‌‌ పర్సన్‌‌‌‌ : ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌

కాంగ్రెస్ అసమర్థ సర్కార్ .. సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి యాక్టివ్‌‌‌‌ పర్సన్‌‌‌‌ : ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాత్రం యాక్టివ్‌‌‌‌ పర్సన్ అని నిజామాబాద్‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రేవంత్‌‌‌‌రెడ్డి బీజేపీలోకి వస్తే ఓ ఫ్రెండ్‌‌‌‌గా స్వాగతిస్తా, ఆయనొస్తే పార్టీలో ఏ పొజిషన్‌‌‌‌ ఇస్తారనేది హైకమాండ్‌‌‌‌ చూసుకుంటుంది అని చెప్పారు. కవిత లేని నిజామాబాద్‌‌‌‌రాజకీయాలు, ఎన్నికలు ఆల్కహాలిక్‌‌‌‌ ఫ్రీ పోటీలా ఉన్నాయన్నారు. 

కవిత పోటీ చేయాలనుకుంటే జైలు నుంచి కూడా నామినేషన్ వేయొచ్చని చెప్పారు. నిజామాబాద్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ జీవన్‌‌‌‌రెడ్డి ఆజాదీ, ఆజాదీ అంటూ తిరుగుతున్నారని, ఆయన పాకిస్తాన్‌‌‌‌లో తిరుగుతున్న ఆలోచనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాదిరిగానే కాంగ్రెస్‌‌‌‌ కూడా ప్రజలను మోసం చేసిందన్నారు. 

కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాల  వల్లే ఆ పార్టీకి క్యాండిడేట్లు దొరకడం లేదన్నారు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లకు మించి రావన్నారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆప్‌‌‌‌ కీ ఆదాలత్‌‌‌‌ కార్యక్రమం కామెడీ షోలా అనిపించిందని అర్వింద్‌‌‌‌ ఎద్దేవా చేశారు. హిందువుగా చెప్పుకుంటున్న రేవంత్‌‌‌‌రెడ్డి సీఏఏ, ఎన్‌‌‌‌ఆర్సీ, ఆర్టికల్ 370పై వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌‌‌‌కు రామ మందిరం కనిపించడం సంతోషమని, త్వరలోనే కృష్ణ మందిరం కూడా చూపిస్తామన్నారు. పంట కొనుగోలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. దేశవ్యాప్తంగా మూతపడిన 66 షుగర్‌‌‌‌ ఫ్యాక్టరీలను బీజేపీ ఓపెన్‌‌‌‌ చేసిందని, ప్రస్తుతం అవి లాభాల్లో నడుస్తున్నాయన్నారు.