వ్యాక్సిన్​ కోసం యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది

వ్యాక్సిన్​ కోసం యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి

నాగర్​కర్నూల్, వెలుగు: కరోనాతో తలకిందులైన యావత్​ ప్రపంచం వ్యాక్సిన్​కోసం భారత్​ వైపు చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి సమీపంలోని అక్షరవనంలో పేరెంట్స్​మీట్​లో మంత్రి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్​ తయారీలో నాలుగు కంపెనీలు ముందుంటే అందులో రెండు భారత్​లో ఉన్నాయన్నారు. అందులో ఒకటి హైదరాబాద్​లో ఉండడం మనందరికి గర్వకారణమని అన్నారు. శనివారం మొదలయ్యే వ్యాక్సిన్ ​ఫస్ట్ ​డోస్ ​కరోనా ఫ్రంట్​లైన్​ వారియర్స్ కు ఇస్తారని చెప్పారు. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో ప్రధాని మోడీ మాట్లాడతారని అన్నారు. వ్యాక్సిన్​ తయారీలో 50 శాతం దేశీయ అవసరాలకు, 50 శాతం ప్రపంచ దేశాలకు సరఫరా చేయాలని ప్రధాని నిర్ణయించారన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త అగ్రి చట్టాలపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. రైతుల ఆదాయం పెరిగితే దళారుల బతుకులు రోడ్ల మీద పడతాయనే ఇలా చేశారన్నారు. సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. అక్షరవనం ఏర్పాటు, ఇక్కడి బోధనా విధానాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. కేంద్రం ప్రతిపాదించిన కొత్త విద్యా విధానంలో అక్షరవనంలో అవలంభిస్తున్న పద్ధతులు, బోధనా విధానాలను పరిగణనలోకి తీసుకునేలా చూస్తానని అన్నారు. జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, శ్రీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

For More News..

కేసీఆర్ సారు ఎప్పుడొస్తరో.. ఇండ్లు ఎప్పుడిస్తరో!

కూతురి కళ్లెదుటే తల్లిదండ్రుల సజీవ దహనం

డబుల్​ బెడ్​రూం ​ఇండ్లలో అర్ధరాత్రి గృహ ప్రవేశాలు! అడ్డుకున్న ప్రజలు