
హైదరాబాద్, వెలుగు : తనను కలుసుకునేందుకు వచ్చే వారు బొకేలు, పూల దండలు తీసుకురావద్దని ఎంపీ కిషన్రెడ్డి సూచించారు. తప్పని పరిస్థితిలో అదే ఖర్చుతో విద్యార్ధులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు వంటివి తీసుకువస్తే పేద విద్యార్ధులకు అందజేయగలనని తెలిపారు.
రాష్ట్రంలో పేద విద్యార్ధులందరికీ విద్యా అవకాశాలు కల్పించేందుకు అభిమానులు, కార్యకర్తలు కృషిచేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విజయోత్సవాలు, ర్యాలీలకు దూరంగా ఉండాలని ఇటీవలే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా అభిమానులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలకు పెట్టే ఖర్చును తన ట్రస్ట్ కు పంపించాలని కోరారు. తన ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఆ నిధులు చేర్చుతానని చెప్పారు.