
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని కాంగ్రెస్ చూస్తున్నదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కోర్టులో కావాలనే ఓడిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికలు ఆలస్యమైతే చెప్పలేమని, కానీ ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకే అడ్వంటేజీ అని అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
‘‘ఏ పార్టీ అయినా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కానీ వికారాబాద్ బీజేపీలో కొంత ఎక్కువగా ఉన్నాయి. తప్పులు జరిగితే పార్టీ గుర్తించి వాటిని సరిదిద్దాలి” అని సూచించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్, ట్రంప్ అంశంలో వ్యవహరిస్తున్న తీరు, జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుతో ప్రజల్లో ప్రధాని మోదీపై విశ్వాసం పెరిగిందన్నారు.