ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సంచలన విషయాలు బయట పడతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనాత్మక విషయాలు బయటపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. 

రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పెద్దల ఒత్తిడి లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్రదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిగే న్యాయం జరుగుతుందన్నారు.  మరోవైపు అందెశ్రీ రాసిన పాటను స్వాగతిస్తున్నామని చెప్పారు. అందెశ్రీ పాట విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు లక్ష్మణ్.