కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

మహబూబాబాద్/ తొర్రూరు, వెలుగు: హైదరాబాద్ గాంధీ భవన్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భుక్య మురళీ నాయక్ ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీలం దుర్గేశ్ ముదిరాజ్ తో సహా పలువురు నాయకులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. 

క్రీడా శాఖ  మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మాజీ డీసీసీ ప్రెసిడెంట్​జెన్నారెడ్డి భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ కాంగ్రెస్​తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ రెడ్డి, పీసీసీ మెంబర్​ దస్రు నాయక్, కేసముద్రం మండలాధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నీలం దుర్గేశ్​ ముదిరాజ్​ ఆధ్వర్యంలో తొర్రూరుతోపాటు జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన ముదిరాజ్​ సామాజిక వర్గ నాయకులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్​ తరలివెళ్లారు.