రికార్డుల నమోదుపై నిర్లక్ష్యమేంటి? : కలెక్టర్ స్నేహ శబరీశ్

రికార్డుల నమోదుపై నిర్లక్ష్యమేంటి? : కలెక్టర్ స్నేహ శబరీశ్

హసన్ పర్తి, వెలుగు: యూరియా స్టాక్ పంపిణీ వివరాల రికార్డు నమోదు చెయ్యకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  సిబ్బందిపై హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మండలం జయగిరి రోడ్డుని మహాత్మా జ్యోతిబాపూలే రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల (కాజీపేట) ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా యూరియా స్టాక్, పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యూరియా స్టాక్, పంపిణీ వివరాలను రికార్డులో ఎందుకు రాయడం లేదని  పీఏసీఎస్ సిబ్బంది ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఏడీఏ ఆదిరెడ్డి, హసన్ పర్తి పీఏసీఎస్ ప్రత్యేకాధికారి జగన్మోహన్ రావు పాల్గొన్నారు.