ఓటర్‌‌‌‌‌‌‌‌లిస్టు మ్యాపింగ్లో గందరగోళం.. డోర్‌‌‌‌‌‌‌‌ నంబర్లు బేస్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంతో తిప్పలు

ఓటర్‌‌‌‌‌‌‌‌లిస్టు మ్యాపింగ్లో గందరగోళం.. డోర్‌‌‌‌‌‌‌‌ నంబర్లు బేస్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంతో తిప్పలు
  • సమస్య పెంచిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌ ‌‌‌‌డేటా ‌‌‌‌
  • ఒక డివిజన్‌‌‌‌ ‌‌‌‌ఓటర్లు మరో డివిజన్‌‌‌‌‌‌‌‌లోకి
  • లిస్టు మొత్తం సెట్‌‌‌‌‌‌‌‌చేస్తం : కమిషనర్‌‌‌‌‌‌‌‌ 

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్​నగర పాలక సంస్థలో శుక్రవారం రిలీజ్‌‌‌‌‌‌‌‌చేసిన ముస్తాయిదా ఓటర్‌‌‌‌ ‌‌‌‌లిస్టు వివాదానికి తెరలేపింది. టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సమస్యతో డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ అయిన డేటా వల్ల ఇతర జిల్లాల ఓటర్ల పేర్లు ఇక్కడి లిస్టులోకి వచ్చాయి. ఇంటి నంబర్లు ప్రామాణికం చేసుకొని ఏరియాలు ఫిక్స్‌‌‌‌‌‌‌‌చేయడంతో ఒక డివిజన్‌‌‌‌‌‌‌‌లోని ఓటర్లు సంబంధలేని మరో డివిజన్‌‌‌‌‌‌‌‌లోకి మారారు. దీనిపై బీజేపీ నాయకులు అభ్యంతరం తెలుపడంతో ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

నాన్‌‌‌‌‌‌‌‌లోకల్‌‌‌‌‌‌‌‌ పేర్ల లిస్టు.. 

జిల్లాలో నగర పాలక సంస్థతో పాటు బోధన్‌‌‌‌‌‌‌‌, ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, భీంగల్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. స్టేట్‌‌‌‌‌‌‌‌ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ‌‌‌‌నిర్వహణ కోసం ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్టును సిద్ధం చేసింది. ఈ క్రమంలో పోలింగ్‌‌‌‌‌‌‌‌సెంటర్లు, ముసాయిదా ఓటర్‌‌‌‌‌‌‌‌లిస్టు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి జనవరి 1 గడువు విధించింది. టీపోల్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌నుంచి ‌‌‌‌ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్టు డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌ ‌‌‌‌చేసుకొని మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌చేయాలని సూచించింది. ఈ క్రమంలో డేటా పొందిన నగర పాలక ఆఫీసర్లు డిసెంబర్‌‌‌‌‌‌‌‌31 నుంచి జనవరి 1 అర్ధరాత్రి 2 గంటల వరకు కసరత్తు చేసి ముసాయిదా ప్రకటించారు. మొత్తం 60 డివిజన్ల పరిధిలో 413 పోలింగ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లు, 3,44,756 ఓటర్లతో కూడిన ముసాయిదాను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో వేరే జిల్లాలకు చెందిన  ఓటర్ల పేర్లు రావడం వివాదానికి  కారణమైంది.

ప్రతి 800 ఓటర్లకు ఒక పోలింగ్‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌ చొప్పున ఏర్పాటు చేయాలని  నిర్ణయించారు.  డోర్‌‌‌‌‌‌‌‌నంబర్లను మాత్రమే లెక్కలోకి తీసుకొని పోలింగ్‌‌‌‌‌‌‌‌సెంటర్ల పరిధిలో చేర్చారు. ఈ విధానం చాలా మంది ఓటర్ల డివిజన్‌‌‌‌‌‌‌‌ మార్చేసింది. మాధవ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌ ‌‌‌‌ఓటర్లు దుబ్బాలోకి వెళ్లారు. అక్కడి ఓటర్లు కోటగల్లికి, వినాయక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌ ‌‌‌‌ఓటర్లు శివాజీనగర్‌‌‌‌‌‌‌‌కు మారారు. డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఓటర్‌‌‌‌‌‌‌‌లిస్టుపై అభ్యంతరాలు స్వీకరించడానికి 5న పొలిటికల్‌‌‌‌‌‌‌‌పార్టీ లీడర్లతో ఆఫీసర్లు మీటింగ్‌‌‌‌‌‌‌‌ఏర్పాటు చేశారు. 10న ఫైనల్‌‌‌‌‌‌‌‌లిస్టు ప్రకటించే టైంకు పూర్తి కరెక్షన్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఓటర్‌‌‌‌‌‌‌‌లిస్టు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇవాల్టి నుంచే సరి చేస్తాం

సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లో తలెత్తిన టెక్నికల్‌‌‌‌ సమస్యకు తోడుగా మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ముసాయిదా ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్టులో తప్పిదాలు గుర్తించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శనివారం నుంచి వార్డ్‌‌‌‌ ‌‌‌‌ఆఫీసర్లతో డోర్‌‌‌‌‌‌‌‌ నంబర్ల వారీగా పేర్లు క్రాస్‌‌‌‌‌‌‌‌చెక్‌‌‌‌‌‌‌‌ చేయిస్తం. రెవెన్యూ వింగ్‌‌‌‌‌‌‌‌ సపోర్టు కూడా తీసుకుంటాం. అనుమానిత ఓటర్లు 2,600 మందిని ఇప్పటికే పక్కనపెట్టాం. ఈ వారమంతా సరిచేసి 10న తుది జాబితాను విడుదల చేస్తాం. - దిలీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, నగర పాలక కమిషనర్‌‌‌‌‌‌‌‌