దేశ భద్రతను టీఎంసీ ఎంపీ తాకట్టు పెట్టారు : నిషి కాంత్ దూబే

దేశ భద్రతను టీఎంసీ ఎంపీ తాకట్టు పెట్టారు : నిషి కాంత్ దూబే
  • పార్లమెంటరీ ఐడీని దుబాయ్‌‌లో ఉపయోగించారు : నిషికాంత్ 

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషి కాంత్ దూబే మరోసారి సంచలన ఆరో పణలు చేశారు. ఆమె భారత్​లో ఉన్న ప్పుడు ఆమె పార్లమెంటరీ ఐడీని మరొకరు దుబాయ్‌‌లో ఉపయో గించారని పేర్కొ న్నారు. ఈ అంశాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌‌ఐసీ) దర్యాప్తు సంస్థలకు తెలి యజేసిందని శనివారం ఆయన ట్విట్టర్​లో ఆరోపించారు. మహువా పేరును ప్రస్తావించకుండా "ఒక ఎంపీ డబ్బు కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టారు. 

ఆమె భారత్​లో ఉన్నప్పుడు దుబాయ్‌‌లో ఆమె పార్లమెంటు ఐడీ తెరవబడింది. మొత్తం భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, కేంద్ర సంస్థలు ఈ ఎన్ఐసీలో ఉన్నాయి. టీఎంసీ, ప్రతిపక్షాలు ఇప్పటికీ దీనిని రాజకీయం చేయాలను కుంటున్నాయా? దీనిపై ఇక ప్రజలదే నిర్ణయం" అని ట్వీట్ చేశారు.అయితే, ఏ ఏజెన్సీకి సమాచారం అందించిందో మాత్రం ఆయన వెల్లడించలేదు. మహువా మొయిత్రా.. అదానీ గ్రూప్‌‌, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ ఇటీవల నిషికాంత్ దూబే లోక్‌‌సభ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు.