
దేశంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారేనన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్. దేశమే ప్రథమ ప్రాధాన్యంగా మోడీ పనిచేస్తున్నారని కొనియాడారు. తొమ్మదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు కూడా లేవన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. తమది 24 గంటలు పని చేసే సర్కార్ అని అన్నారు. దేశంలో అవినీతి రహిథ సర్కార్ ను మొదటి సారి చూస్తున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తాము అన్ని అనుమతిలిచ్చామని..ఈ వషయంలో కేసీఆర్ కూడా తమను మెచ్చుకున్నారన్నారు. నేషనల్ థర్మల్ ప్రాజెక్టు, రామగుండం ఎరువుల ప్రాజెక్టులు ఇచ్చామన్నారు. పంటలకు మద్ధతు ధర విషయంలో మోడీ సర్కారు రైతులకు మేలు చేశారన్నారు. వరి సహా.. ఇతర పంటలకు మద్ధతుధరలు పెంచామన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎరువుల ధరలు భారీగా పెరిగినా.. రైతులపై భారం పడకుండా సబ్సిడీ ఇస్తున్నామన్నారు. పాల ఉత్పత్తిలో దేశం నెంబర్ వన్, చేపల ఉత్పత్తిలో రెండో స్థానం, వరి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు.