రిలీజ్ కు ముందే జాన్వీ మూవీ ఆస్కార్ ఎంట్రీ

రిలీజ్ కు ముందే జాన్వీ మూవీ ఆస్కార్ ఎంట్రీ

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటించిన  ‘హోమ్ బౌండ్’ చిత్రం రిలీజ్‌‌‌‌కు ముందే రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2026 అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ భారత్ తరపున ఈ ఎంట్రీ పొందినట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇండియా నుంచి 24 సినిమాలు పోటీ పడగా, ‘హోమ్ బౌండ్’ చిత్రం ఎంట్రీ దక్కించుకుందని సెలక్షన్‌‌‌‌ కమిటీ ఛైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ ఎన్‌‌‌‌. చంద్ర అనౌన్స్ చేశారు. 

ఇప్పటికే  పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌‌‌‌లో స్క్రీనింగ్ చేయబడిన ఈ చిత్రానికి మంచి అప్లాజ్ దక్కింది. ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీతో మరో ఘనతను సాధించింది మూవీ టీమ్.   జాన్వీతోపాటు ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన ఈ సినిమాకు నీరజ్ మైవాన్ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహర్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా కలిసి నిర్మించారు. పోలీసు కావాలనే తమ కలను సాధించే ప్రయత్నంలో భాగంగా క్యాస్ట్‌‌‌‌, రిలీజియన్‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇద్దరు ఫ్రెండ్స్ కథే ఈ చిత్రం. సెప్టెంబర్ 26న సినిమా విడుదల కానుంది.