ఒప్పో పండుగ ఆఫర్లు.. ఫోన్తో పాటు రూ.10 లక్షలు గెలుచుకునే ఛాన్స్

ఒప్పో పండుగ ఆఫర్లు.. ఫోన్తో పాటు రూ.10 లక్షలు గెలుచుకునే ఛాన్స్

హైదరాబాద్​, వెలుగు:   పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌ను పురస్కరించుకుని ఒప్పో ఇండియా తన ప్రత్యేక సేల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  ఈ నెల 19 నుంచి అక్టోబర్ 31 వరకు జరిగే ఈ సేల్‌‌‌‌‌‌‌‌లో వినియోగదారులు ఒప్పో ఎఫ్​31 సిరీస్, రెనో14 సిరీస్ వంటి  ఫోన్లపైన అనేక ఆఫర్లను పొందవచ్చు. ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌లు రీటైల్ దుకాణాలతో పాటు ఒప్పో ఈ-–స్టోర్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్, అమెజాన్‌‌‌‌‌‌‌‌లలో కూడా లభిస్తాయి. 

ఈ సందర్భంగా కస్టమర్లు జీరో  డౌ న్‌‌‌‌‌‌‌‌పేమెంట్, వడ్డీ లేని ఈఎమ్ఐలు, తక్షణ క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ స్కీములు పొందవచ్చు.  కొత్త ఒప్పో ఫోన్‌‌‌‌‌‌‌‌లను గెలుచుకోవడంతో పాటు, రూ.10 లక్షలు లేదా రూ.లక్ష నగదు బహుమతులను కూడా గెలుచుకునే అవకాశం ఉందని ఒప్పో ఇండియా పీఆర్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ చెప్పారు.   వడ్డీ లేని ఈఎమ్ఐలతోపాటు 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నామని వివరించారు.