పండుగ ముందు పసిడి జోరు.. రూ.800 పెరిగిన బంగారం ధర

పండుగ ముందు పసిడి జోరు.. రూ.800 పెరిగిన బంగారం ధర

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా–-చైనా మధ్య మళ్లీ మొదలైన వాణిజ్య వివాదాల మధ్య పసిడి ధరలు పెరిగాయి.  ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 19) 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 1.14 లక్షలకు చేరింది. 

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, గత ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో రూ. 1,13,200 వద్ద ముగిసిన 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం రూ. 800 పెరిగింది.  99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా రూ. 700 పెరిగి రూ. 1,13,500కి ఎగిసింది. గత ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో ఈ ధర రూ. 1,12,800 వద్ద ముగిసింది. 

వెండి ధరలూ వరుసగా రెండో రోజు లాభాలను కొనసాగించాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ. 1,32,000కి చేరింది. గురువారం దీని ధర కిలోకు రూ. 1,31,500గా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,  అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు,  కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల వల్ల బంగారం, వెండికి డిమాండ్​ పెరుగుతోందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.