ఓటర్ కార్డుల పంపిణీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు : ఎంపీ రఘునందన్ రావు

ఓటర్ కార్డుల పంపిణీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు : ఎంపీ రఘునందన్ రావు
  • కాంగ్రెస్‌‌ నేతల చేతుల్లోకి కార్డులు ఎలా వెళ్లాయని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేయడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తప్పుబట్టారు. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్ సీఈవో సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు, కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. 

బహిరంగంగా ఓటర్ కార్డులు పంచుతున్నప్పటికీ, ఎన్నికల కమిషన్ గానీ, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ గానీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ ఎన్నికల్లో పోటీకి ఎలా అర్హుడు అవుతాడని ప్రశ్నించారు. ఓటర్ ఐడీ కార్డులు వారికి జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ ఇచ్చారా లేదా ఎన్నికల కమిషన్ ఇచ్చిందా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.