సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించిన సోయం బాపూరావు

సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించిన సోయం బాపూరావు

ఖమ్మంలో  బీజేపీ కార్యకర్త  సాయిగణేష్ ఆత్మహత్యకు  మంత్రి పువ్వాడ  అజయ్ కుమార్, స్థానిక  కార్పొరేటరే  కారణమని ఆదిలాబాద్ ఎంపీ  సోయం బాపూరావు అన్నారు. సాయిగణేష్పై రౌడీషీట్ ఓపెన్ చేయడంతోనే  మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఖమ్మంలో బాధితుడి ఇంటికి  వెళ్లిన   కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిగణేష్ ఫొటోకు  పూలమాలలు  వేసి నివాళులర్పించారు. అంతకుముందు ఖమ్మం సీపీ  విష్ణు వారియర్ను  కలిసిన నేతలు.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని  కోరారు. సాయి  ఆత్మహత్య  బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.