విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలె

విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలె

హైదరాబాద్: ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు అని బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ...  ఎన్నో మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ దేశ ప్రజలంతా తామంతా ఒక్కటేననే భావంతో జీవిస్తున్నారని అన్నారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు భారత్ గ్రేట్ అంటూ పొగడుతున్నాయని అన్నారు.

విద్యార్థి దశలోనే చాలా విషయాలు నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం ఉండాలన్నారు. క్రమశిక్షణ ఉంటేనే విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరగలరని తెలిపారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సరోజా వివేక్, సెక్రెటరీ వినోద్, జాయింట్ సెక్రెటరీ రమణ కుమార్ తో పాటు స్కూల్, ఇంటర్, డిగ్రీ , ఎంబీఏ, లా కాలేజీల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.