నేరస్థులు నేరాన్ని ఒప్పుకుంటారా?

నేరస్థులు నేరాన్ని ఒప్పుకుంటారా?

న్యూఢిల్లీ: నేరస్థుడు తాను నేరం చేశానని ఒప్పుకోగా మీరెప్పుడైనా చూశారా అని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఆమె తనయుడు రాహుల్ ను ఉద్దేశించి నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో సోనియా, రాహుల్ కి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా స్పందించారు.

సోనియా, రాహుల్ తాము తప్పు చేయలేదనే చెబుతారని, కానీ వారు తప్పు చేసినట్లుగా గట్టి సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైన తమ మీద తప్పుడు కేసు నమోదయిందని భావిస్తే కోర్టును ఆశ్రయించి ఆ కేసును కొట్టివేయించుకునేందుకు ప్రయత్నిస్తారని... కానీ సోనియా, రాహుల్ ఇందుకు విరుద్ధంగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీన్ని బట్టి వాళ్లు తప్పు చేశారని అర్థమవుతోందని ఆయన ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం...

నిర్మాతలకు ‘కాసుల’ కష్టాలు

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్