ఎంపీ పదవికి జేపీ నడ్డా రాజీనామా

ఎంపీ పదవికి జేపీ నడ్డా రాజీనామా

భారతీయ జనాతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు గుజరాత్ నుంచి ఎగువ సభకు ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎంపీ పదవికీ  సోమవారం (మార్చి4) రాజీనామా చేశారు. ఏప్రిల్ 2024లో పదవీ కాలం ముగియనున్న 57 మంది రాజ్యసభ ఎంపీలలో నడ్డా కూడా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభకు ఎన్నికయ్యారు జేపీ నడ్డా... తన రాజ్యసభలో స్థానానికి రాజీనామా చేశారు. నడ్డా రాజీనామాను మార్చి 4, 2024న రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. 

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నడ్డా 2012 నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 2న నడ్డా పదవీకాలం ముగియనున్నందున హిమాచల్ ప్రదేశ్ లో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన హర్ష్, మహాజన్ కాంగ్రె్ కు చెందిన అభిషేక్ మను సింఘ్వీని డ్రా ద్వారా ఓడించి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదర్దు అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు రావడంతో లాటరీద్వారా మహాజన్ ను విజేతగా ప్రకటించారు.