
ప్రతీ ఒక్క భారతీయ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నట్టు తాము చెప్పలేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకే తాము చర్యలు తీసుకుంటామని చెప్పామని ఆయన గుర్తుచేశారు. బ్లాక్ మనీ వెలికితీసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ మరువలేదని… అన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.