బీసీ హాస్టల్స్ లో వసతులు మెరుగుపర్చండి: బీజేపీ ఓబీసీ మోర్చా

బీసీ హాస్టల్స్ లో వసతులు మెరుగుపర్చండి: బీజేపీ ఓబీసీ మోర్చా
  • బీసీ హాస్టల్స్ లో వసతులు మెరుగుపర్చండి
  • బీసీ గురుకుల సెక్రటరీకి బీజేపీ ఓబీసీ మోర్చా నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నందున బీసీ గురుకుల హాస్టల్స్ లో వసతులను మెరుగుపర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయనతో పాటు నేతలు ఈశ్వరప్ప, సురేందర్ యాదవ్, శరత్  బీసీ గురుకులాల సెక్రటరీ సైదులును కలిసి వినతి పత్రం అందజేశారు. గత ఏడు నెలల్లో వివిధ గురుకులాల్లోని చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని నేతలు వినతిపత్రంలో తెలిపారు. కుళ్లిన కూరగాయలను వండి పెట్టడంతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు స్కూల్స్ బుక్స్ అందజేయాలని కోరారు. గురుకులాల్లోని సమస్యలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిచి పరిష్కరించాలని ఆనంద్ గౌడ్ వివరించారు.