ముగిసిన బీజేపీ పదాధికారుల సమావేశం

ముగిసిన బీజేపీ పదాధికారుల సమావేశం

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్తే అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ కోర్ కమిటి, రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తో పాటు కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, మురళీధర్ రావు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తే.. ఎదుర్కోవడానికి అవసరమైన కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం, పార్లమెంట్ ప్రవాస్ యోజన, కేంద్రమంత్రుల పర్యటనలపై చర్చిస్తున్నారు. ఉదయం జరిగిన కోర్ కమిటీ భేటీలో.. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో నియోజకవర్గాల్లో బండి సంజయ్ పర్యటనపై రూట్ మ్యాప్ ను ఈ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు.