బూత్ కమిటీలపైనే బీజేపీ ఫోకస్

బూత్ కమిటీలపైనే బీజేపీ ఫోకస్
  •      వాటిద్వారే ఓటర్లను కలవాలని ప్లాన్​
  •     ప్రతి పోలింగ్ బూత్​లో ఎక్కువ ఓట్లు పడేలా ప్రణాళిక
  •     హైకమాండ్ ఆదేశాలతో  కమిటీల యాక్టివేషన్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ నేతల దృష్టంతా బూత్ కమిటీలపైనే ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కమిటీల ద్వారానే ఓటర్లను కలవాలని ప్లాన్ రెడీ చేశారు. కానీ, ప్రస్తుతం అన్ని కమిటీలు లేకపోవడంతో పాటు ఉన్న కొన్ని కమిటీలు యాక్టివేషన్​లో లేకపోవడం నేతలను కలవరపెడుతున్నది. దీన్ని గుర్తించిన బీజేపీ హైకమాండ్.. ప్రతి బూత్ కమిటీని ప్రారంభించాలని  ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు ప్రణా ళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 35వేలకు పైగా పోలింగ్ బూత్​లు ఉన్నాయి. వీటిలో సగం చోట్ల బీజేపీకి కమిటీలు ఉన్నాయి. బీజేపీ పట్టణాలకే పరిమితమనే అపవాదును తొలగించుకునేందుకు గ్రామీణ ప్రాంతా ల్లోని పోలింగ్ బూత్​ కమిటీల నిర్మాణంపై ఫోకస్ పెంచింది. 

గతంలో తప్పుడు సమాచారం

గత అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ మేనేజ్​మెంట్​ను నమ్ముకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తలిగింది. చాలా చోట్ల కమిటీల నిర్మాణం చేయకున్నా.. ఉన్నట్టు రాష్ట్ర నేతలకు తప్పుడు సమాచారం ఇచ్చారు. బూత్ కమిటీలు చాలా చోట్ల సరిగ్గా పనిచేయలేదని గత అసెంబ్లీ ఎన్నికల రివ్యూలో తేలింది. దీనికి నేతలపై ఉన్న అసంతృప్తితోపాటు స్థానిక పరిస్థితులు ఓ కారణంగా గుర్తించారు. ఈ తప్పిదాలను సరిచేసేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. 

టిఫిన్ బైఠక్​ ఏర్పాటు

 ప్రతి బూత్​కు కమిటీని వేయాలని బీజేపీ నిర్ణయించిం ది. అనుబంధ మోర్చాల కమిటీలను కూడా వే యాలని రాష్ట్ర నేతలను ఆదేశించింది. ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావం సందర్భంగా అన్ని పో లింగ్ బూత్​లలో టిఫిన్ బైఠక్​లను ఏర్పాటు చేసింది. సాధ్యమైనన్ని ఎక్కువ బూత్​లలో ఈ కార్యక్రమం జరిగేలా చర్యలు మొదలుపెట్టింది. దీనిద్వారా పోలింగ్ బూత్ లలో పార్టీ యాక్టివిటీ ఎలా ఉందో అంచనా వేయొచ్చని భావిస్తున్నది.  ప్రతి బూత్​లో 370 ఓట్లు లేదా సగం ఓట్లు బీజేపీకి పడేలా ప్రచారం చేయాలని హైకమాండ్ ఆదేశాలిచ్చింది.