
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది. జనవరి 16 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియోజకవర్గాల పర్యటన తర్వాత బస్సు యాత్రకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేతలు వేర్వేరుగా యాత్రలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలని నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాల్లో బస్సు యాత్రలు ఉండేలా బీజేపీ కార్యచరణ రూపోందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి అయ్యాక పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రానికి చేరుకుని భారీ బహిరంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది.