
పాల్వంచ, వెలుగు: దేశ ప్రధాని మోదీ పిలుపుమేరకు ఆపరేషన్ సిందూర్ విజయవంతమయ్యాక వచ్చిన మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని నెహ్రూ నగర్ లో బీజేపీ మండల అధ్యక్షుడు రాపాక రమేశ్ అధ్యక్షతన మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈనెల 11, 12 తేదీల్లో మండల కేంద్రాల్లో తిరంగా ర్యాలీలు నిర్వ హించాలని, 13, 14 తేదీల్లో స్వాతంత్ర సంగ్రామ చారిత్రక ప్రదేశాలు, జాతీయ నేతల విగ్రహాలు ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ నిర్వహించాలని, అమర సైనికులు, పోలీసుల కుటుంబాలకు సన్మానం చేయాలన్నారు. ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేసి, 15న ప్రతి ఇంటిపై ఎగరవేసేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జీవీకే మనో హర్, కేవీ రంగా కిరణ్, జల్లారపు శ్రీనివాస్, గొడుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.