బీసీల పేరుతో కాంగ్రెస్ దొంగ జపం : కాసం వెంకటేశ్వర్లు

బీసీల పేరుతో కాంగ్రెస్ దొంగ జపం : కాసం వెంకటేశ్వర్లు
  • సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది బీజేపీనే: కాసం వెంకటేశ్వర్లు 

హైదరాబాద్,వెలుగు: బీసీల పేరుతో  కాంగ్రెస్ దొంగ జపం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఓడిపోతామని తెలిసినా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ బీసీని నిలబెట్టలేకపోయిందన్నారు. మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ నిరంతరం బీసీల గురించి మాట్లాడుతుంటారని, కానీ ఆచరణలో మాత్రం వారికి ఏమీ చేయడం లేదన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించిందన్నారు. 

బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉదయ్‌‌‌‌పూర్ డిక్లరేషన్ ప్రకారం కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని వెంకటేశ్వర్లు వివరించారు. అబ్దుల్ కలాం (మైనార్టీ), రామ్ నాథ్ కోవింద్ (దళితులు),  ద్రౌపది ముర్ము (గిరిజన మహిళ)ను రాష్ట్రపతులుగా నియమించినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంబీసీ కులాలకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌‌‌‌ను ప్రకటించిందని చెప్పారు. ఎవరు బీసీలకు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.