
- రాజస్థాన్ సీఎం కుటుంబ సభ్యులపై ఈడీకి బీజేపీ ఎంపీ ఫిర్యాదు
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడీలాల్ మీనా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కు ఫిర్యాదు చేశారు. సీఎం సంపాదించిన బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు షెల్ కంపెనీలను వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కొడుకు వైభవ్ గెహ్లాట్, ఆయన బిజినెస్ అసోసియేట్‌పై హవాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ తో వైభవ్ కు సంబంధాలు ఉన్నాయన్నారు. వైభవ్, మరికొందరు పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని, బినామీ పేర్లతో ట్రాన్సాక్షన్లు నిర్వహించారని ఆరోపించారు. మారిషస్‌కు చెందిన షెల్ కంపెనీ ద్వారా బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.