
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( మే 11 నుంచి మే 17 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. .
మేష రాశి : ఈ వారం ఆరోగ్య పరిస్థితి జ్యోతిష్య నిపుణుల వివరాల ప్రకారం మెరుగుపడుతుంది. ఉద్యోగులు అన్నీ విధాల బాగుంటుంది. కుటుంబ యజమానికి ... కుటుంబసభ్యుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.వ్యాపారస్తులు అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృషభ రాశి : ఈ వారం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు లాభాలు రాకపోయినా నష్టం ఉండదు, ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఆర్థికవిషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. పెళ్లి విషయాన్ని వాయిదా వేయండి. దూరంగా ఉన్న ప్రేమికులు ఈ వారంలో కలుసుకునే అవకాశం ఉంది.
మిథున రాశి : ఈ రాశి వారు ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల సమయం. అయితే ఈ రాశి వారు ఇతరులతో మాట్లడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశాలున్నాయి. విద్య.ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
కర్కాటక రాశి : ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. అనుకోకుండా లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. భూవివాదాలు.. ఆస్తి సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితి బాగుంటుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి... అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంశలు.. అవార్డులు లభిస్తాయి. ఈ వారం బంధువుల తాకిడి ఎక్కువ కావడంతో అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి . ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
తులా రాశి: ఈ రాశికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువుల కొనే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు జాబ్ మారే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కష్టపడాల్సి ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనవసర పరిచయాలతో నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
వృశ్చిక రాశి: ఈ వారం చేపట్టిన పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఖర్చులు రావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేతివృత్తులు వారు కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఏదో తెలియని ఆందోళన వేధిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగాఉంటుంది. ఆస్తి పంపకాల విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. గతంలో పెండింగ్ పనులను మళ్లీ మొదలుపెడతారు. ఇక వ్యాపారస్తుల విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆశించిన రీతిలో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులు బిజీబిజీగా గడుపుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆదాయ వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనవసర ప్రయాణాలు.. అధిక ఖర్చులు కొంత ఆందోళనకు గురి చేస్తాయి. నిరుద్యోగులకు జాబ్ లభించే అవకాశం ఉంది. ఎవరిని నమ్మవద్దు.. ప్రతి విషయాన్ని మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమ వ్యవహారంలో అధికంగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభం లేకపోయినా నష్టం రాదు.పెళ్లిసంబంధాలు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం మెరుగు పడుతుంది. కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయం. గతంలో చేతిరాదు అనుకున్న సొమ్ములు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మాట తొందరపాటు వల్ల సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా సాగిపోతుంది.నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది.
మీన రాశి : ఈ రాశి వారు ఈ వారం కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారం కూడా దాదాపు బాగానే ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆస్తుల విషయంలో కొన్ని అగ్రిమెంట్లు జరిగే అవకాశం ఉంది. గృహనిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు కలుగుతాయి.