
ఇండియా-పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన అంశంపై ప్రధాని మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో చర్చించారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ తో మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీజ్ ఫైర్ లో భాగంగా సహనంతో ఉన్నామని, కానీ ఈ సారి పాక్ దాడి చేస్తే తమ వైపు నుంచి సమాధానం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. పాక్ ఏదైనా చేయాలని చూస్తే ఈ సారి విధ్వంసమేనని అన్నారు.
కశ్మీర్ అంశంపై కూడా ప్రధాని మోదీ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. కశ్మీర్ అంశంలో తమ వైఖరి మారదని ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంలో మాట్లాడటానికి ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని.. అది పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) ను తిరిగి స్వాధీనం చేసుకోవడమేనని అన్నారు.
భారత్ - పాకిస్తాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని అన్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని, అది సాధారణంగా జరుగుతూనే ఉంటుందని చెప్పారు. ఇది పాకిస్తాన్ గుర్తించుకోవాలిన, ప్రపంచం కూడా ఈ విషయాన్ని పరిగణించాలని అన్నట్లు తెలుస్తోంది. పాక్ తో చర్చలు జరపాలంటే ఇండియాపై దాడి చేసిన టెర్రరిస్టులను అప్పగించి చర్చలకు రావాలని అన్నారు.
భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని స్పందన ఏంటని చూస్తున్న తరుణంలో.. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ తో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.