
ఇండియా-పాక్ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ సైనిక అధికారి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ప్రెస్ మీట్ లో భాగంగా పుల్వామా దాడి ‘వ్యూహాత్మక ప్రతిభ’ అని అభివర్ణించడంతో పాక్ బుద్ధి ఏంటో స్పష్టంగా అర్థం అవుతోంది. పాక్ సైనికాధికారి ఔరంగజేబ్ అహ్మద్ పుల్వామా దాడి తమ పనేనని చెప్పకనే చెప్పాడు. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్తాన్ సైన్యం పాత్ర ఉందని మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అంగీకరించాడు.
తమ గగణతలం, భూ, జలాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే రాజీపడే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా ఔరంగజేబ్ అన్నారు. తాము దేశానికి రుణపడి ఉన్నామని..పాక్ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతామని అన్నారు.
పాక్ సైనికాధికి ప్రకటనతో.. పుల్వామాతో పాటు ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా పాక్ పాత్ర ఉందనే అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయి. ఈ ప్రకటనతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలైంది.
ఇక ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో జరిగిన సూసైడ్ బాంబ్ దాడిలో 40 మంది CRPF జవాన్లు చనిపోయారు. దీని వెనుక పాక్ హస్తం ఉందని భారత్ విమర్శించిన తరుణంలో ఇందుతో తమ ప్రమేయం లేదని గట్టిగా వాదించింది. అదే సమయంలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూనే ఈ ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉన్నట్టు అనేక ఆధారాలను బయటపెట్టింది.
భారత్ అనుమానాలను పాక్ కొట్టిపడేస్తూ వచ్చింది. ఈ ఉగ్రదాడిలో తమ సైన్యం పాత్ర లేదని అప్పటి ప్రధాని బుకాయిస్తూ వచ్చారు. అయితే ఆరేళ్ల తర్వాత పాక్‌కు చెందిన సైనిక అధికారే స్వయంగా పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందని ఒప్పుకోవడంతో పాక్ వ్యవహారం బయటపడింది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే విధంగా ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు కృషి చేస్తామని చెప్తూ వస్తున్న అమెరికా (ట్రంప్) పాక్ పై తమ వైఖరేంటో, ఏం చెప్తుందో చూడాలి.