సరికొత్త లుక్ తో మారుతి సుజుకి బ్రెజా.. తక్కువ ధరతో టాప్ ఎండ్ ఫీచర్స్

సరికొత్త లుక్ తో మారుతి సుజుకి బ్రెజా.. తక్కువ ధరతో టాప్ ఎండ్ ఫీచర్స్

ఇండియన్స్ ఫేవరెట్ SUV లలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజా సరికొత్త లుక్ తో మార్కెట్ లోకి వచ్చింది. అడ్వాన్స్డ్ ఫీచర్స్, డిజైన్స్ తో కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్ ని లాంచ్ చేసింది మారుతి సుజుకి. ఇండియన్ మార్కెట్ కి అనుగుణంగా ధరలో పెద్దగా మార్పులు లేకుండానే కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది మారుతి సుజుకి. ఎలిగెంట్ డిజైన్, బెస్ట్ ఫీచర్స్ కోరుకునే ఇండియన్ కస్టమర్ అభిరుచికి అనుగుణంగా బ్రెజా కొత్త వేరియంట్ ని డిజైన్ చేసింది మారుతి సుజుకి.

ఎక్స్ టీరియర్ డిజైన్ అప్ డేట్స్: 

బ్రెజా కొత్త వేరియంట్ అట్రాక్టింగ్ గా.. ఇండియన్ రోడ్స్ పై మ్యాచో లుక్ తో కనిపించనుంది. ముందు భాగంలో మేజర్ ఫేస్ లిఫ్ట్ ఈ కొత్త వేరియంట్ కి ప్రధాన ఆకర్షణ అని చెప్పచ్చు.ఇది కార్ కి టాప్ ఎండ్ లుక్ ఇస్తుంది. కొత్త హెడ్‌లైట్ క్లస్టర్‌లలో ఇప్పుడు LED లైట్లు ఉన్నాయి, ఇవి రాత్రిపూట వెహికల్ కి బెటర్ విజిబిలిటీ ఇవ్వడమే కాకుండా అందంగా కనిపిస్తాయి.

బాడీ ప్యానెల్‌లు టైటర్ గ్యాప్స్ తో హై క్వాలిటీ పెయింట్‌తో అట్రాక్టివ్ గా ఉంది. సైడ్ నుంచి లైన్స్ తో బ్రెజా లుక్ ని మరింత ఎన్ హన్స్ చేస్తాయి. కొత్తగా రూపొందించిన 19, 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరింత మస్క్యూలర్ లుక్ ని ఇస్తోంది. అన్ని రోడ్ కండిషన్స్ కి తగిన గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉంటుంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సైడ్ మోల్డింగ్‌లు హయ్యర్ సెగ్మెంట్ ఫీల్ ని ఇస్తున్నాయి.

ఇంటీరియర్ రిఫైన్‌మెంట్స్:

క్యాబిన్ లో కొత్త డబుల్ క్యాబ్ వర్షన్ కంఫర్ట్ లెవెల్స్ ని మరింత పెంచుతుంది. ఆర్కిటెక్చర్ ఎంత అట్రాక్టింగ్  ఉందో, ఫంక్షనింగ్ కూడా అంతే అట్రాక్టింగ్ గా ఉంటుంది.. అలాగే సెగ్మెంట్‌కు ప్రీమియం, మెటీరియల్స్ ఫీల్, ఇంప్రూవ్డ్ టెక్స్చర్‌లు క్యాబిన్ అంబియెన్స్ ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. క్యాబిన్ కి హయ్యర్ క్వాలిటీ ఫీల్ ఇవ్వడం కోసం సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ ని స్క్రాచ్ స్టఫ్ ప్లాస్టిక్ తో రీప్లేస్ చేశారు.

కొత్త వేరియంట్ లో సీట్ అప్ హోల్స్టారి కూడా అప్ గ్రేడ్ అయ్యింది. ఇది మంచి ఫీల్, బెటర్ ప్యాడింగ్ ఇస్తోంది. డ్రైవర్ సీట్ కి హైట్ అడ్జస్ట్మెంట్ ఉండటంతో  అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది. వెనుక భాగంలో లెగ్‌రూమ్ కూడా సఫిషియెంట్ గా సపోర్టివ్ సీట్ కాంటూర్‌లతో, బ్రెజ్జా లాంగ్ డ్రైవ్‌లకు కూడా అనుకూలిస్తుంది.

టెక్నాలజీ ఇంటిగ్రేషన్:

టెక్నాలజీ పరంగా కొత్త బ్రెజాలో హైలైట్స్ ఏమీ లేవనే చెప్పాలి. ఒక్క కనెక్టివిటి ఫీచర్స్ తప్ప పెద్దగా మార్పులేమీ లేవు. రీజనబుల్ ధరతో రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మారుతి సుజికి కొత్త బ్రెజా ప్రారంభ ధర రూ. 8. 50 లక్షలు కాగా.. బ్రెజా టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 14.14 లక్షలుగా ఉంది.