క్రికెటర్ శ్రీచరణిని అభినందించిన టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు...

క్రికెటర్ శ్రీచరణిని అభినందించిన టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు...

ఇండియన్ విమెన్ క్రికెట్ టీం ఇటీవల జరిగిన ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సాధించిన టీంలో ఒకరైన తెలుగు ప్లేయర్ శ్రీచరణి టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ( నవంబర్ 15 ) తిరుమల చేరుకున్న శ్రీచరణి.. శ్రీవారి దర్శనానంతరం క్యాంపు ఆఫీసులో ఛైర్మెన్ బీఆర్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు బీఆర్ నాయుడు. 

శ్రీచరణిని శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు బీఆర్ నాయుడు. శ్రీవారి ఆశీస్సులతో పాటు క్రికెట్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రీచరణిని ఆశీర్వదించారు బీఆర్ నాయుడు.టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడుతో సహా బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా శ్రీచరణిని శాలువాతో సత్కరించారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల శ్రీచరిణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.2.5 కోట్ల నగదు బహుమతి, 1,000 చదరపు గజాల నివాస స్థలం, గ్రూప్-I ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.