బీహార్ ఎన్నికల్లో దాదాపు 50 ఏళ్ల తర్వాత అత్యధిక పోలింగ్ నమోదు కావడంపై.. ఈ సారి ఏదో పెద్ద మార్పు జరగబోతుందనే చర్చ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతతో ఓటింగ్ శాతం పెరిగిందని.. ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థిగా మహాగట్బంధన్ గెలుపు ఖాయమని ఆ కూటమి నేతలు, కార్యకర్తలు బాగా నమ్మారు. కానీ ఫలితాల్లో కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఫలితాలపై మౌనంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎట్టకేలకు స్పందించింది. 2025 నవంబర్ 15వ తేదీన ఓటమిపై ఎక్స్ లో పోస్ట్ చేసింది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం.. ప్రజా సేవలో ప్రయాణానికి గమ్యం అంటూ ఉండదు.. సేవ చేసుకుంటూ పోవాల్సిందేనంటూ పార్టీ ప్రకటించింది.
తమ పార్టీ పేదల పార్టీ అని.. తమ గొంతుక వినిపించడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించింది. విజయానికి పొంగిపోము.. ఓటమికి కుంగిపోము.. గెలిస్తే బాధపడం.. ఓడితే అహంకారం ప్రదర్శించం.. ప్రజాసేవే మా మార్గం.. అంటూ ఆర్జేడీ ట్వీట్ చేసింది.
2020 ఎన్నికల్లో 75 సీట్లు గెలుచుకున్న ఆర్జేడీ, ఆ సారి మాత్రం ఘోరంగా విఫలమైంది. అయితే బీహార్ లో అన్ని పార్టీలకంటే అత్యధికంగా ఓట్లను పొందింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 23 శాతం ఓట్లను సాధించింది. బీజేపీ కంటే 2.92 శాతం ఎక్కువ, సీఎం నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు) కంటే 3.75 శాతం ఎక్కువ.
ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మహాఘటబంధన్ కేవలం 35 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది, కాంగ్రెస్ ఆరు సీట్లను గెలుచుకుంది, 19 నుండి సీపీఐ(ఎంఎల్) రెండు సీట్లు, సీపీఐ(ఎం) ఒక సీటు, సీపీఐ సున్నా సీట్లు గెలుచుకుంది.
అధికార ఎన్‌డీఏ ప్రజా వ్యతిరేకతను అధిగమించి 202 స్థానాలను గెలుచుకుంది, బీజెపీకి 89, జెడియుకి 85, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 19, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామ్ మోర్చా 5, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్‌వాహా లోక్‌సభకు 5 స్థానాలు లభించాయి.
जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025
इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!
राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd
