Rajamouli Movie Title: మహేష్-రాజమౌళి మూవీ టైటిల్ ఫిక్స్.. మైథలాజి & టెక్నాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్లో

Rajamouli Movie Title: మహేష్-రాజమౌళి మూవీ టైటిల్ ఫిక్స్.. మైథలాజి & టెక్నాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్లో

వరల్డ్ ఆడియన్స్ మోస్ట్ ఎవైటెడ్ కాంబో మహేష్ బాబు-రాజమౌళి. వీరిద్దరి కలయిక ప్రపంచ బాక్సాఫీస్పై అతిభారీ అంచనాలు పెంచేసింది. ‘‘సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించిన క్షణం నుండి... ప్రస్తుతం నడిచే ఈవెంట్ వరకు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలు అనుకునేంతలా.. తమ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నీరిక్షిస్తున్నారు.

సినీ క్రిటిక్స్ అయితే.. సినిమా కథకి సంబంధించి అనేక వ్యూహ రచనలు చేశారు. బ్రేక్ అవుట్ వీడియోస్ చేశారు. 'గ్లోబ్-ట్రాటర్'ప్రీ లుక్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ', ప్రియాంక చోప్రా 'మందాకినీ'.. సంచారి సాంగ్ వరకు.. సినిమా గమనాన్ని అంచనా వేస్తూ వచ్చారు. ఇపుడు అందరీ ఎదురుచూపులకు, అంచనాలకు ఎండ్ కార్డ్ పడింది. అందరి ప్రశ్నలకు సమాధానం దొరికే క్షణం వచ్చేసింది’’ ఇవాళ శనివారం (నవంబర్ 15న) జరుగుతున్న గ్లోబ్-ట్రాటర్ ఈవెంట్ నుంచి అనేక అప్డేట్స్ వెల్లడించారు దర్శక ధీరుడు రాజమౌళి. 

‘గ్లోబ్‌‌‌‌ట్రాటర్’ పేరుతో జరుగుతున్న ఈ ఈవెంట్లో సినిమా టైటిల్ ప్రకటించారు రాజమౌళి. ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్కి ‘‘వారణాసి’’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వారణాసి సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ ఫుల్ విలన్‌గా భయపెట్టనున్నాడు.

చరిత్ర, పురాణాల మిశ్రమంగా టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథలాజి అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.  దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌‌‌‌తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.