బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్ కుమార్ రావు-పత్రలేఖ తల్లితండ్రులయ్యారు. ఇవాళ శనివారం (2025 నవంబర్ 15న) ఈ దంపతులు తమ మొదటి సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హీరో రాజ్ కుమార్ రావు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘తమ నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ రోజే.. ఆడబిడ్డ జన్మించడం ఎంతో సంతోషం’ అని రాజ్ కుమార్ రావు ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఇరువురు ఫ్యాన్స్ పాపకు వెల్కమ్ చెబుతూ.. దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాజ్‌కుమార్ రావు- పత్రలేఖ 2021 నవంబర్ 15న మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 9న పత్రలేఖ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సిటీలైట్స్ (2014) సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు పెద్దలు సైతం పచ్చజెండా ఊపడంతో.. దాదాపు పదేళ్ల ప్రేమ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇకపోతే.. రాజ్‌కుమార్ రావు 2010లో రణ్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన 'షాహిద్' సినిమాకు గాను ఉతమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవలే స్త్రీ 2తో ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అతని కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు పొందారు.
అందులో లవ్ సెక్స్ ఔర్ ధోఖా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, తలాష్, కై పో చె, సిటీ లైట్స్, హమారీ అదూరీ కహాని, స్త్రీ, లవ్ సోనియా, లూడో, హిట్: ద ఫస్ట్ కేస్, భేడియా, శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలతో అలరించాడు. పత్రలేఖ సినీ విషయానికి వస్తే.. లవ్ గేమ్స్, నానూ కీ జాను, బద్నాం గాలి, వైల్డ్ వైల్డ్ పంజాబ్, పూలె వంటి పలు మూవీస్ చేసింది.
