ఎక్కువసమయం కూర్చుంటున్నారా.. గుండెకు ప్రమాదమే..పరిశోధకులు ఏమంటున్నారంటే..

ఎక్కువసమయం కూర్చుంటున్నారా.. గుండెకు ప్రమాదమే..పరిశోధకులు ఏమంటున్నారంటే..

మీరు కూర్చొని పనిచేస్తున్నారా..? రోజులో 10 గంటలకంటే ఎక్కువగా కూర్చుంటున్నారా?.. అయితే మీకై మీరు ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నట్లే..రోజులో ఎక్కువ సమయం కూర్చునే వారికి గుండె సంబంధిత సమస్యలు ఎక్కువే అని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం చేసినప్పటికీ ఎక్కువ సమయం కూర్చోవడం రిస్క్ అంటున్నారు. అయితే ఇలాంటి వారు ఏం చేయాలి.. ఏం చేస్తే గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. వాటి పరిష్కారాలు కూడా పరిశోధకులు వెల్లడించారు. అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం..    

గుండె జబ్బులు ఇప్పుడు ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు. కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్,అరిథ్మియా వంటి హృదయ సంబంధ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వారికి లేదా హార్ట్ సంబంధిత సమస్యలు ఉన్నవారు మరోసారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఇలాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ఏంచేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

మారుతున్న జీవన విధానం, వాతావరణ పరిస్థితులు, ఆహారం, రోజువారి దినచర్య వీటికి గుండె సమస్యలకు దారి తీస్తుంది. అయితే భవిష్యత్తులో గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు కొన్ని రకాల యాక్టివిటీస్ చాలా ఉపయోగపడతాయని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్న 40వేల మందికి పైగా ఆస్ట్రేలియన్లపై ఇటీవల జరిపిన అధ్యయనంలో మరోసారి హార్ట్ అటాక్ రాకుండా కొన్ని సమాధానాలు దొరికాయి. తక్కువ సమయం కూర్చోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం వంటి యాక్టివిటీస్ - భవిష్యత్తులో గుండె సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఈ అధ్యయనాల్లో తేలింది. 

ఎక్కువ సమయం కూర్చుంటే ప్రమాదమే.. 

మనం పనిలో ఉన్నపుడు, భోజనం చేస్తున్నడు, టీవీ చూస్తున్నపుడు కూర్చుని చేస్తుంటాం. అయితే ఎక్కువగా కూర్చోవడం ప్రమాదకరం అని అధ్యయనాల్లో తేలింది. రోజుకు 10.30 గంటలపై గా కూర్చోవడం వల్ల గుండె సమస్యలు ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. రోజుకు 7గంటల కంటే తక్కువగా కూర్చునే వ్యక్తులకు హార్ట్ అటాక్ లేదా గుండె సమస్యల  ప్రమాదం 16 శాతం నుంచి 21 శాతం వరకు తక్కువగా ఉంటుందట. రోజులో ఎంత తక్కువ సమయం కూర్చుంటే అంత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. 

శరీర కదలికలు చాలా ముఖ్యం..హార్ట్ డెసీస్ దరిచేరవు

శారీరక శ్రమ భవిష్యత్తులో గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిందంటున్నారు పరిశోధకులు. శరీరకంగా కదలికలు ఉన్నవారిలో తీవ్రమైన హార్ట్ అటాక్ లాంటి తీవ్రమైన గుండె సమస్యలు ఉండవని చెబుతున్నారు. వారానికి 1నుంచి 149 నిమిషాలు శరీర కదలికలు ఉన్న వారిలో .. ఏమీ చేయని వారితో పోలిస్తే 21 శాతం ప్రాణాంతకమైన గుండె సమస్యలు తక్కువగా ఉంటాయట. అదే వారానికి 150 నిమిషాలకంటే ఎక్కువగా శారీరక శ్రమ అంటే మితమైన వ్యాయామం చేసేవారిలో ఈ ప్రమాదం మరింత తక్కువగా ఉంటుందట. 

గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే .. 

  • రోజుకు కనీసం 10-15 నిమిషాలు నడవాలి.
  • బ్రేకప్ సిట్టింగ్ సమయం. ప్రతి 30 నిమిషాలకు నిలబడాలి. ఫోన్ కాల్స్ సమయంలో నడవాలి. 
  • నడిచేందుకు మెట్లు ఉపయోగించాలి. భోజనం తర్వాత నడవాలి. 
  • రోజుకు దాదాపు 20 నిమిషాలు శరీరాన్ని కనీసం కదిలించేలా ప్రణాళిక సిద్దం చేసుకోండి. 
  • తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి విషయం ఏంటంటే..రోజు ఏదో ఒక పనిచేస్తూనే ఉండాలి. అది మన ఆరోగ్యానికి ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిందంటున్నారు పరిశోధకులు. 
  • ఇక వ్యాయామం దినచర్యను ప్రారంభించే ముందు తప్పకుండా డాక్టర్ సలహాలు తీసుకోవాలి. ప్రత్యేకించి గుండె సమస్యలు ఉంటే స్వల్ప వ్యాయామం మంచిది.

హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు చాలా ముఖ్యం.. 

ఎవరికైనా కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) ఉన్నప్పుడు గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి మరొకసారి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ప్రతి ముగ్గురిలో ఒకరు రెండేళ్లలోపు తిరిగి ఆసుపత్రిలో చేరతారు.  గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వైద్యులు చాలా కాలంగా వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ ఈ కొత్త పరిశోధన చిన్న చిన్న పనులు కూడా ఎంత ముఖ్యమో చూపిస్తుంది. సాధారణంగా మనం ఎంత సమయంలో కూర్చుని గడుపుతామో మనం లెక్కవేయం. కానీ హార్ట్ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం.