
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చు..ఉన్నత స్థాయిలకు వెళ్లవచ్చు.మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. అయితే ఆరోగ్యానికి మొదటి శత్రువు నిద్రలేమి.
రాత్రి పూట మీకు నిద్ర పట్టడం లేదా..? నిద్రలేమితో పగటిపూట చిరాకు వస్తుందా? రోజంతా మీ దినచర్యను పాడు చేస్తుందా? నిద్రలేపోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణ సమస్య అయిపోయింది.ప్రతీ ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉంది. నిద్ర లేకపోవడం వల్ల వ్యాధులు త్వరగా అటాక్ చేస్తాయి. మీరూ ఈ సమస్యతో బాధపడుతున్నారా?.. అయితే కళ్లు మూసుకున్న వెంటనే నిద్ర పట్టేలా కొన్ని చిట్కాలు, సులభమైన పద్దతులు ఈ ఆర్టికల్ లో మీకోసం..
నిద్ర అనేది శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది అంటుంటారు.అయితే కొన్నిసార్లు శరీరం అలసిపోయినా నిద్ర పట్టకపోవచ్చు. సరైన సమయంలో శరీరం నిద్ర సంకేతాలు అందితేనే నిద్ర వస్తుంది. అలా శరీరం సరైన నిద్ర సంకేతాలు పొందేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు డాక్టర్లు.
మొదటి చిట్కా: రాత్రిపూట నిద్రపట్టకపోతే మొదటి పరిష్కారం మార్గం.. మంచం మీద పడుకొని 4సెకన్ల పాటు గాలి పీల్చుకోవాలి.. తర్వాత 7 సెకన్ల పాటు గాలిని బంధించాలి. ఆ తర్వాత 8 సెకనుల పాటు గాలిని పీల్చుకోవాలి తర్వాత వదలాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే నిద్రపోతారు.
రెండో చిట్కా: మంచి నిద్రకోసం .. నిద్రపోయేటప్పుడు కాటన్ సాక్స్ లు ధరించాలి. సాక్స్ ధరించడం వల్ల మీ పాదాలు వేడెక్కి.. శరీరాన్ని చల్లబర్చేందుకు మెదడుకు సంకేతాలు ఇస్తుంది. ఇది మంచి నిద్రకు దారి తీస్తుంది. కాటన్ సాక్స్ ధరించి నిద్రపోయే వ్యక్తులు రాత్రి పూట తక్కువసమయం మేల్కొంటారని ఓ అధ్యయనంలో తేలింది.
మూడో చిట్కా: లావెండర్ నూనెను వాసన చూడటం వల్ల మంచి నిద్ర వస్తుంది. లావెండర్ మీ మెదడుకు భావోద్వేగపరంగా అనుసంధానించే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుందని 11 క్లినికల్ ట్రయల్స్ లో నిర్ధారించారు. హృదయస్పందన రేటు, బీపీ, కొలెస్ట్రారాల్ స్థాయి కూడా తగ్గుతాయి.
ఇంకెందుకు ఆలస్యం.. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ చిట్కాలనుపాటించండి..మంచి ఫలితాలను పొందవచ్చు.