ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూస్తున్నది

ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూస్తున్నది
  • బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పేదలు, దళితులు, గిరిజనుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నదని ఆరోపించారు. వారికి దక్కాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మనదేశ సార్యభౌమాధికారాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు.  కాంగ్రెస్  నైజం ఏంటో అమెరికా గడ్డపై నుంచి రాహుల్ ప్రపంచానికి చెప్పారు. గాంధీ కుటుంబం మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీల పట్ల నిర్లక్ష్య వైఖరితోనే ఉంది. కాంగ్రెస్ రాజ్యాంగానికి వందకు పైగా సవరణలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ రిజర్వేషన్లను మారుస్తుందంటూ అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాలి" అని ఎస్.కుమార్ పేర్కొన్నారు.