బీజేపీతోనే ముషీరాబాద్​లో అభివృద్ధి: డీఎస్ రెడ్డి

బీజేపీతోనే ముషీరాబాద్​లో అభివృద్ధి: డీఎస్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ సెగ్మెంట్ జనం మార్పు కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత డీఎస్ రెడ్డి తెలిపారు. సెగ్మెంట్​లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడమే అందుకు కారణమన్నారు. శనివారం గాంధీనగర్​లోని తన ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్ రెడ్డి మాట్లాడారు. ముషీరాబాద్​లో ఇప్పటికీ డ్రైనేజీ, తాగు నీటి పైప్ లైన్ వ్యవస్థ సరిగా లేదన్నారు. 

డివిజన్​లోని బస్తీలు, కాలనీల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో సెగ్మెంట్​లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడితే ముషీరాబాద్​లో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.